పర్యావరణ రక్షణ మన బాధ్యత
- గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి కార్యక్రమం
- ఎంపీ సంతోష్‌కుమార్‌కు అభినందనలు
- హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర
- హైకోర్టు ప్రాంగణంలో మొకనాటిన సీజే

హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ను అభినందించారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తులు ఏజీ బీఎస్ ప్రసాద్, అడిషనల్ ఏజీ జే రామచందర్‌రావుతో కలిసి ఎంపీ సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు గుర్తుచేశారు. ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. హైకోర్టు ప్రాంగణంలోని ప్రభుత్వ పాత జజ్గీఖానా (ప్రసూతి దవాఖాన)లో తాను జన్మించానని, ఆ ప్రాంగణంలో మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీజేతోపాటు న్యాయమూర్తులకు వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ జీ శ్రీదేవి, జస్టిస్ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్‌గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కల్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్‌కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, ఫుడ్ కమిషన్ సభ్యుడు గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

