పాత వెహికల్స్ అప్పగిస్తే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: వెహికల్స్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. వ్యర్థమైన, పాత వాహనాలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న వారు వాటిని అప్పగించి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుంది. వెహికల్ స్క్రాపేజీ పాలసీలో ఈ నిబంధనను కేంద్రం చేర్చనున్నది. ఈ సంగతి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గత నెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వాహనాలకు 20 ఏండ్ల తర్వాత, వాణిజ్య వాహనాలకు 15 ఏండ్ల తర్వాత ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి అని ప్రకటించారు. మరో 15 రోజుల్లో వెహికల్ స్క్రాపేజీ పాలసీని కేంద్రం వెల్లడించనున్నది.
అందులో చేర్చే నిబంధనల్లో పాత వాహనాలను అప్పగించి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే ఆటోమొబైల్ సంస్థలు ధరలో ఐదు శాతం రాయితీ కల్పిస్తాయని గడ్కరీ చెప్పారు. ఈ వెహికల్ స్క్రాపేజీ పాలసీలో నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయన్నారు. ధరలో ఐదు శాతం రాయితీ, పాత కాలుష్య కారక వాహనాలపై గ్రీన్ ట్యాక్స్‌లు, ఇతర లెవీల్లో రాయితీలు లభిస్తాయన్నారు. ఆటోమేటెడ్ ఫెసిలిటీల్లో ఫిట్నెస్, పొల్యూషన్ టెస్టులు తప్పనిసరి కానున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. స్క్రాపేజీ సెంటర్ల కోసం ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చేయూతనివ్వనున్నది. ఆటొమేటెడ్ టెస్ట్‌ల్లో విఫలమైన వెహికల్స్‌పై భారీ జరిమానా విధించడం జరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

