జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల పోస్టర్ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్. జవహర్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. మార్చి 11వ తేదీ నుంచి 21వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. 12వ తేదీ ధ్వజారోహణం, 16వ తేదీ గరుడోత్సవం, 19న రథోత్సవం, 20న చక్రస్నానం, 21వ తేదీ పుష్ప యాగం నిర్వహిస్తామన్నారు. టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

