Jio Air Fiber | జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది..!
Jio Air Fiber | రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించిన మేరకు వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్ ఫైబర్ ఆవిష్కరించింది.
Jio Air Fiber | ముందుగా ప్రకటించినట్లే రిలయన్స్ జియో (Reliance Jio) వినాయక చవితి సందర్భంగా మంగళవారం.. జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) సర్వీస్ లాంఛనంగా ప్రారంభించింది. గత నెల 28న జరిగిన రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో జియో ఎయిర్ ఫైబర్ తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, పుణె నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) సేవలు అందుబాటులో ఉంటాయి. ఇన్స్టలేషన్ చార్జీల కింద రూ.1000 చెల్లించాలి. ఆసక్తి గల వారు రూ.100 పే చేసి జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) బుక్ చేసుకోవచ్చు. మిగతా మొత్తం బిల్లులో సర్దుబాటు చేస్తారు.
జియో ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు జియో అధికారిక వెబ్సైట్కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) కనెక్షన్తోపాటు లేటెస్ట్ వై-ఫై రూటర్, టీవీ అండ్ వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ కోసం 4కే సెట్ టాప్ బాక్స్ ఇస్తారు. అన్ని రకాల ప్లాన్లు ఆరు నెలలు, 12 నెలల ఆప్షన్లలో లభిస్తాయి. ఒకవేళ మీరు 12 నెలల ప్లాన్ ఎంచుకుంటే రూ.1000 ఇన్స్టలేషన్ చార్జీలో పూర్తి రాయితీ ఇస్తారు.
దేశంలో ఏ ప్రాంతంలోనైనా జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) పోర్టబిలిటీ లభిస్తుంది. అయితే, ఆ ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉండాలి. బ్రాడ్ బాండ్ తరహాలో జియో ఎయిర్ ఫైబర్ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.
ప్రస్తుతం దేశీయంగా జియో ఆప్టిక్ వైర్ టెక్నాలజీతో కూడిన బ్రాడ్ బాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో, ఎయిర్ టెల్ వైర్ టెక్నాలజీ ఫైబర్ సేవలు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ, ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండానే ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ అందిస్తుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ ఇంటర్నెట్ తేలిగ్గా లభిస్తుంది.
ఇవీ జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు..
రూ.599 ప్లాన్లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షించొచ్చు. రూ.899 ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అదనం. ఇక రూ.1199 ప్లాన్ కింద నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో కార్యక్రమాలు చూడొచ్చు.
జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ క్యాటగిరిలో రూ.1499 ప్లాన్ మీద 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగంతోపాటు జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లన్నీ చూడవచ్చు. రూ.2499 ప్లాన్ కింద 500 ఎంబీపీఎస్ స్పీడ్, రూ.3999-1 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ ప్లాన్లపై అదనంగా జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

