Janagoan | జనగామలో విషాదం.. భార్య ఆత్మహత్య చేసుకుందని.. రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై
Janagoan | జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.
Janagoan | జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కాసర్ల శ్రీనివాస్ జనగామ పట్టణంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్వరూపతో కలిసి వెంకన్నకుంటలో నివాసం ఉంటున్నాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ గురువారం తెల్లవారుజామున ఎస్సై శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత బాత్రూంకి వెళ్లిన శ్రీనివాస్‌కు.. కిటికీ ఊచలకు వేలాడుతున్న భార్య మృతదేహం కనిపించింది. అది చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఈ విషయం తెలియగానే ఎస్సై శ్రీనివాస్ బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి పరామర్శించారు. జనగామ ఏసీపీ, సీఐ కూడా ఎస్సై ఇంటికి వచ్చి ఓదార్చారు. కానీ ఆయన తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి దాకా ఏడుస్తూ ఉన్న ఎస్సై శ్రీనివాస్ కాసేపటికి వాష్రూంకి అని వెళ్లాడు. అక్కడే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.
అయితే బుధవారం రాత్రి సమయంలో శ్రీనివాస్‌కు, అతని భార్యకు కలహాలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై దంపతుల మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- janagaon
- latest news
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

