James Webb Space Telescope | ఫాంటమ్ గెలాక్సీ అద్భుతమైన చిత్రాలు.. విడుదల చేసిన నాసా!!
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి ఫుల్ కలర్ ఫొటోని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా జూలై 12న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కట్టే ఈ ఫొటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా, ఈ టెలిస్కోప్ ఫాంటమ్ గెలాక్సీ అద్భుతమైన ఫొటోలను తీసి పంపింది. ఈ ఫొటోలను నాసా శనివారం విడుదల చేసింది. బ్లాక్‌హోల్‌తో కలర్ఫుల్గా ఉన్న ఫాంటమ్ గెలాక్సీ ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లుకొడుతున్నాయి.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన గెలాక్సీ అసలు పేరు మెస్సియర్ 74. దీన్ని 1780లో చార్లెస్ మెస్సియర్ కనుగొన్నారు. ఎన్జీసీ 628గా కూడా పిలిచే ఈ స్పైరల్ గెలాక్సీని అంతరిక్ష ప్రియులు ముద్దుగా ఫాంటమ్ గెలాక్సీ అని పిలుస్తారు. ఇది గ్రాండ్ డిజైన్ స్పైరల్ గెలాక్సీకి సరైన ఉదాహరణ. ఇది నవంబర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలో గెలాక్సీ చిన్న చిన్న నీలిరంగు నక్షత్రాలను కలిగి ఉంది. ఈ నక్షత్రాలనుంచి వచ్చే అతినీలాలోహిత కాంతితో గెలాక్సీ గులాబీరంగులో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌లోని ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఈ గెలాక్సీని అద్భుతంగా, అత్యంత స్పష్టంగా చిత్రీకరించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!