హీరోయిజం అంటే ఏంటో తెలిసింది
తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి రానాది ఓ ప్రత్యేక శైలి. మిగతా హీరోలకు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పిస్తుంటారీ కథానాయకుడు. ఆయన తాజాగా ‘భీమ్లా నాయక్’లో డేనియల్ శేఖర్‌గా నెగిటివ్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా విజయంపై తాజా ఇంటర్వ్యూలో తన స్పందన తెలియజేశారు రానా.
‘భీమ్లా నాయక్’తో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఈ సినిమాకు మొదట ఎంపికైన నటుడిని నేనే. మాతృక ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చూశాక ఆశ్చర్యపోయాను. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను మూడు గంటల సినిమాగా ఆకట్టుకునేలా మలచడం ఆసక్తికరంగా అనిపించింది. పాటలు, ఫైట్లు వంటి కమర్షియల్ కొలతలు ఉండే సినిమాల కన్నా నాకు ఇలాంటి చిత్రాలంటేనే ఇష్టం. అందుకే వెంటనే అంగీకారం తెలిపా.
నెగిటివ్ పాత్ర చేసినా మెప్పించడంపై మీ స్పందన ఏంటి?
హాలీవుడ్లో ఐరన్‌మ్యాన్ క్యారెక్టర్‌ను రాబర్ట్ అనే నటుడు చేశారు. ఆయన కథలో ఎవరికీ నచ్చని పనులు చేస్తుంటాడు, కానీ ఆ పనులతోనే ప్రేక్షకులు అతన్ని ఇష్టపడుతుంటారు. భీమ్లా..లో డానియల్ శేఖర్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. మద్యం సేవిస్తాడు, అహంకారంతో ప్రవర్తిస్తాడు, పోలీసులు చేయి చేసుకుంటే తట్టుకోలేక ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అయితే భార్యను ప్రేమిస్తాడు, మహిళలను గౌరవిస్తాడు, సైన్యంలో పనిచేశాడు. ఇలాంటి మంచి నేపథ్యమూ ఉంది. దాంతో ఈ పాత్రకు ప్రేక్షకుల అభిమానం దక్కింది. లేకపోతే భీమ్లా పాత్ర ముందు బోర్లా పడిపోయేది.
ఇకపై పవన్‌ను అనుసరిస్తానని అన్నారు ఎందుకని?
ఒక స్టార్‌గా పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటనేది ఈ సినిమాతో తెలుసుకున్నాను. హీరోయిజం తెలిసింది. అందుకే ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ను చూసి సినిమాలు చేయడం నేర్చుకున్నా అని అన్నాను. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ అంతకుముందు ‘గబ్బర్ సింగ్’ ఒక క్యారెక్టర్ నడిపించే చిత్రాలు చేశారు పవన్. నేనూ అలా నటిస్తే మనసుకు నచ్చిన చిత్రాలు చేస్తూనే కమర్షియల్ స్టార్‌గా ఎదిగే అవకాశముంది.
మాతృక నుంచి ఈ సినిమాకు చేసిన మార్పులపై సంతృప్తి కలిగిందా?
మాతృకలోని కొన్ని సన్నివేశాలు అలాగే తెరకెక్కించాం. తెరపై చూసుకున్నాక అచ్చు అలాగే రూపొందించడం నచ్చలేదు. మలయాళంకు మన ప్రేక్షకుల అభిరుచికీ చాలా తేడా ఉంది. మన వాళ్లకు నచ్చేలా రీ షూట్ చేశాం. ఒక పంపిణీదారుడు గతంలో నాతో అన్నాడు ‘మిగతా చిత్రపరిశ్రమల్లో కథలను తెరకెక్కిస్తున్నారు, తెలుగులో మాత్రం ఫిలిం మేకింగ్ చేస్తున్నారు‘ అని. ఆ మాట నాకు గర్వంగా అనిపించింది.
ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నట్లున్నారు
గతంలో ఆరోగ్యం బాగాలేక రెండేళ్లు విశ్రాంతి తీసుకున్నాను. ఆ తర్వాత పని భారం పెరిగింది. ‘విరాటపర్వం’, ‘భీమ్లా నాయక్’తో పాటు నెట్ ఫ్లిక్స్ ‘రానా నాయుడు’ సిరీస్ లో నటిస్తున్నా. ఈ మూడు ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా అయ్యింది.
వెంకటేష్‌తో మీరు కలిసి నటిస్తున్న‘రానా నాయుడు’వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది
నటనలో నాదొక తరహా, బాబాయ్ (వెంకటేష్)ది మరొక తరహా. మేమిద్దరం కలిసి తొలిసారి ‘రానా నాయుడు’ అనే ఒక కొత్త జానర్ వెబ్ సిరీస్ చేస్తున్నాం. విభిన్నంగా ఉంటుందని చెప్పగలను ఇంతకంటే ఎక్కువ చెప్పొద్దని ఆ ఓటీటీ వాళ్లు షరతులు పెట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

