ముంబై: ఐపీఎల్ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్.. తెలుగు హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్‌తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రియాంకా తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది. ఆ ఫోటోకు క్యూట్ అంటూ అయ్యర్ కామెంట్ చేశాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్టెయిన్స్ చాటున ఉన్నట్లు దిగిన ఫోటోను ఇటీవల ప్రియాంకా జవాల్కర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఆ ఫోటోకు క్యూట్ అని కామెంట్ పెట్టిన అయ్యర్‌ను.. ఎవరు నీవు అంటూ ప్రియాంకా అడిగింది.
వెంకటేశ్ అయ్యర్ కామెంట్‌కు ప్రియాంకా రియాక్ట్ అయిన తీరును బట్టి క్రికెటర్ అభిమానులు డౌట్లో పడ్డారు. ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ చిగురిస్తుందో ఏమో అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరాటీ కుటుంబానికి చెందిన ప్రియాంకా.. ఏపీలోని అనంతపురంలో పుట్టింది. 2017లో రిలీజైన కలవరమాయే ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ట్యాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాల్లోనూ ఈ బ్యూటీ నటించింది.