చెకోవియన్.. మన రోహిత్
నటనపై ఆసక్తి ఆ కుర్రాడిని అమెరికా వరకు తీసుకెళ్లింది. అక్కడి రంగస్థలంపై తెలుగువాడి సత్తా నిరూపించింది. హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన రోహిత్ గచ్చిబౌలిలోని దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ నుంచి నటనలో పట్టా అందుకున్నాడు.
నటనపై ఆసక్తి ఆ కుర్రాడిని అమెరికా వరకు తీసుకెళ్లింది. అక్కడి రంగస్థలంపై తెలుగువాడి సత్తా నిరూపించింది. హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన రోహిత్ గచ్చిబౌలిలోని దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ నుంచి నటనలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత, తన ఆరాధ్య రంగస్థల నటుడు, దర్శకుడు లీ స్ట్రాస్బెర్గ్ పేరిట న్యూయార్క్‌లో నెలకొల్పిన థియేటర్-ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. శిక్షణలో ఉండగానే ఎమెలీ డి పైవా, ఎర్మెటె డి బోనితో స్నేహం కుదిరింది. ముగ్గురూ కలిసి ‘ది చెకోవియన్స్’ పేరుతో థియేటర్ సంస్థ నెలకొల్పారు. విఖ్యాత నాటకాల ప్రదర్శనలు మొదలుపెట్టారు. అన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ముగ్గురూ కూడా క్లాసిక్‌గా పేరున్న ‘ది చెర్రి ఆర్చర్డ్’ నాటకాన్ని ఈ తరానికి కొత్తగా పరిచయం చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
రచయిత, దర్శకుడు రాబిన్సన్ రూపొందించిన ‘వై’ నాటకంలో ప్రధాన పాత్ర పోషించి అందరి దృష్టినీ ఆకర్షించాడు రోహిత్. నాటకాల్లో రాణిస్తూనే సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఈ తెలంగాణ బిడ్డ. పలు ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ‘ఇన్ ది స్టిల్ ఆఫ్ ది నైట్’ చిత్రానికి ఫొటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేశాడు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వివిధ పాత్రలు పోషిస్తున్న రోహిత్ స్వీయ దర్శకత్వంలో ‘వన్ లాస్ట్ సన్‌రైజ్’ ద్వారా తెరపై కనిపించాడు. ఈ ప్రయోగాత్మక చిత్రం ఫెస్టివల్ సర్క్యూట్లో పలు అవార్డులు సొంతం చేసుకుంది. ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ మౌన లఘుచిత్రాల విభాగంలో పురస్కారాన్ని అందుకుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

