పుణె: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ గాయపడ్డాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్ చేతికి గాయమైంది. దీంతో ఈనెల 5న ఢిల్లీ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ఈ యువ ఆల్‌రౌండర్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని రైజర్స్ చీఫ్ కోచ్ టామ్ మూడీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ‘సుందర్ మళ్లీ గాయపడటం దురదృష్టం. ఇంతకుముందు తగిలిన చేతికే గాయం కావడంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో తిరిగి గాయపడటంతో చెన్నైతో మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఈ కారణంగా ఢిల్లీతో మ్యాచ్‌లో సుందర్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది ఒక రకంగా జట్టు బౌలింగ్ కూర్పును దెబ్బతీయచ్చు. అతడు మా జట్టులో కీలక ప్లేయర్’ అని మూడీ తెలిపాడు.