Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ వద్ద ఇండియా హౌజ్.. ఏర్పాటు చేస్తున్న రిలయన్స్
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి పారిస్ ఒలింపిక్స్ సమీపంలో ‘ఇండియా హౌజ్' ఏర్పాటవుతున్నది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది.
Paris Olympics | ముంబై, జూన్ 26: మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి పారిస్ ఒలింపిక్స్ సమీపంలో ‘ఇండియా హౌజ్’ ఏర్పాటవుతున్నది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది. ఒలింపిక్స్‌లో వందేండ్ల భారత ప్రాతినిథ్యాన్ని స్మరించుకుంటూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భారతీయ చరిత్ర, టెక్నాలజీ-డిజిటలైజేషన్లో సాధిస్తున్న ప్రగతి, సాంస్కృతిక, క్రీడా వారసత్వ విశేషాలనూ ప్రదర్శించనున్నారు.
ఈ మేరకు బుధవారం ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సభ్యురాలు నీతా అంబానీ తెలిపారు. ఇక పారిస్‌లోని పార్క్ డీ లా విలేట్ వద్ద ఉండే ఈ ఇండియా హౌజ్.. ఒలింపిక్స్ క్రీడలకు వెళ్లే జాతీయ బృందానికి ఓ సొంతిల్లు అనుభూతిని కలిగిస్తుందన్న ఆశాభావాన్నీ ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు. అలాగే క్రీడా ప్రముఖులను కలుసుకునేందుకు సందర్శకులకూ ఓ వేదిక అవుతుందని చెప్పారు. కాగా, జూలై 26న పారిస్‌లో ఒలింపిక్స్ మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11 వరకు ఇవి జరుగుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

