ఇలియానా బోల్డ్ కామెంట్స్.. షాక్లో నెటిజన్స్

ఇలియానా.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాదు హోల్ ఇండియానే తన నడుము మడతల్లో మడత పెట్టిన జఘన సుందరి ఈ ముద్దుగుమ్మ. అవకాశాలు రావట్లేదు రావట్లేదు అని ఏడ్చేకంటే వచ్చిన అవకాశాలు ఎలా యూజ్ చేసుకోవాలో ఈ భామకు బాగా తెలుసు. నాలుగేళ్ళ కింద వచ్చిన హ్యాపీ ఎండింగ్ తోనే ఇల్లీబేబీ కెరీర్ కు హ్యాపీ క్లోజింగ్ పడిపోయింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సినిమాలు చేసినా కూడా కనీసం అవి వచ్చి వెళ్లినట్లు కూడా తెలియదు. అప్పట్నుంచీ అవకాశాల కోసం వేచి చూస్తూనే.. మరోవైపు బికినీ ఫోటోషూట్లు, చిట్టిపొట్టి డ్రస్సుల్లో అందాల ఆరబోతలు చేస్తుంది గోవాబ్యూటీ. రుస్తుమ్ లాంటి సినిమాలు బాగానే ఆడినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు.
ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూకు బ్రేకప్ కూడా చెప్పిన ఇలియానా.. ఒక్కసారిగా ఫిజిక్ పై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు మనం చూసిన ఇలియానా ఈమెనా కాదా అనే అనుమానం వచ్చేలా బరువు పెరిగిపోయింది. అందుకే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అలా కనిపిస్తుంది ఇలియానా. అయితే బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత మళ్లీ ఫిజిక్ పై ఫోకస్ చేసింది ఇల్లీ బేబీ. జిమ్ లో గంటలు గంటలు కష్టపడి మళ్లీ మామూలు స్టేటస్ కు వచ్చేసింది. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అంతే నాజూగ్గా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు కూడా చెప్పుకొచ్చింది ఇలియానా. ముఖ్యంగా తన బాడీ గురించి కూడా చెప్పింది. తనను చాలా సార్లు బాడీ షేమింగ్ చేసారని గుర్తు చేసుకుంది ఇలియానా.
అంతేకాదు ఇలా ఉంటే నువ్వు హీరోయిన్ ఎలా అవుతావ్ అంటూ నిరుత్సాహ పరిచారని.. హీరోయిన్ కావాలంటే వక్షోజాలు పెద్దగా ఉండాలని.. కానీ నీకు లేవని హేళన చేసారని చెప్పుకొచ్చింది ఇలియానా. బయటి వాళ్లు కాదు కానీ తనతో తనకే నచ్చని విషయాలు కూడా చాలానే ఉన్నాయంటుంది. ముఖ్యంగా తన బాడీలో తనకు కొన్ని భాగాలు నచ్చవని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది గోవా సుందరి. కానీ బయట మాత్రం తనలో బ్యూటీ స్పాట్స్ వదిలేసి కేవలం లోపాలను మాత్రమే హైలైట్ చేస్తున్నారని వాపోయింది. తన శరీరంలో ఎదభాగం నచ్చదని చెప్పింది. చేతులు సన్నగా ఉంటాయని.. ముక్కు పెదాలు కూడా సరిగ్గా ఉండవని చెప్పుకొచ్చింది. తాను చూడ్డానికి పొడవుగా కనిపించనని.. పైగా నల్లగా కూడా ఉంటానని చెప్పింది గోవా బ్యూటీ. ఏదేమైనా కూడా తన మైనస్ తాను చెప్పుకోవడం మాత్రం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

