Health tips | మీలో ఈ లక్షణాలుంటే మధుమేహం ఉన్నట్టే.. వెంటనే పరీక్షలు చేయించుకోండి..!
Health tips | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High blood pressure) లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. కాబట్టి మధుమేహం మొదలైతే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం...
Health tips : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High blood pressure) లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. మన దేశంలోనూ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. అయితే కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో చాలామంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి మధుమేహం మొదలైతే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…
డయాబెటిస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ (Prediabetes symptoms) అంటారు. ఈ ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ కింది పేర్కొన్న విధంగా ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రమే కింద పేర్కొన్న వాటిలోని అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. మరి కొందరిలో మాత్రం వీటిలో కొన్ని రకాల లక్షణాలు మాత్రమే బయటపడుతాయి. అసలు లక్షణాలేంటో చూద్దాం..
1. మధుమేహం వచ్చే ముందు కొందరిలో జుట్టు రాలుతుంది. అయితే జుట్టు రాలిందంటే కచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో కచ్చితత్వం వస్తుంది.
2. డయాబెటిస్ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసటగా ఉంటుంది. పని చేసినా, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది.
3. కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
4. ఇంకా కొంత మందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లినా కొద్ది దాహం వేస్తుంది. నీళ్లు తాగినా కొద్ది యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది.
5. కొంత మందిలో పై లక్షణాలతోపాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడుతాయి.
గమనిక : పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే షుగర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

