Samantha | గర్వంగా చెప్పుకోలేని ఎన్నో సినిమాల్లో నటించా.. హాట్ టాపిక్‌గా సమంత కామెంట్స్
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్లో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్లో నటిస్తున్నచిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను గర్వంగా చెప్పుకోలేని ఎన్నో సినిమాల్లో నటించానంది సామ్. చాలా తక్కువ టైంలోనే ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు.. ఉత్సాహంగా నా పేరును కేకలు వేస్తూ పిలవడం, నా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఇదంగా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ స్టార్డమ్ అనే మాయలో మునిగిపోయానని చెప్పింది సమంత. అంతేకాదు మీడియా నా గురించి రాస్తోంది. ఏడాదికి నేను ఎన్ని సినిమాల్లో నటించాననే విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపించేదానిని అంటూ చెప్పుకొచ్చింది.
హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తున్నప్పటికీ తాను అసలు సినిమాకు ఏం ఇస్తున్నానని ఎప్పుడూ కూడా ఆలోచించలేదని చెప్పింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ వైపు గృహిణిగా, మరోవైపు వీరవనితలాగే ఉగ్రరూపం చూపిస్తూ సాగుతున్న ట్రైలర్ సినిమాలో సామ్‌ను సరికొత్తగా చూపించబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
పెళ్లి అయిన అనంతరం పల్లెటూరికి కోడలిగా వెళ్లిన సమంతకి అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి.. తన గతం ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సమంత భర్త రాజ్ నిడిమోర్ ఈ కథను రాయగా.. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ (Tralala Pictures) దీనిని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Also :
Stress | రోజూ నిరంతరాయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ పనులు చేస్తున్నారో చూడండి..
Urea App | భీమ్‌గల్‌లో యూరియా యాప్‌ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఆందోళన
Palakurthi | కేజీబీవీ పక్కకు రైస్ మిల్లులకు అనుమతులు ఇవ్వొద్దు.. పుట్నూర్ మాజీ సర్పంచ్ శారద
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

