అమ్మాయిల తనువులపైనే అద్భుతమైన చిత్రాలు.. హైదరాబాదీ కళాకారిణి ఎందుకిలా చేస్తుంది?
Abhijna Vemuru | స్త్రీమూర్తిని తనదైన కళతో సరికొత్తగా చూపిస్తున్నది అభిజ్ఞ. ఆమెకు తనువులే క్యాన్వాస్లు. స్వేచ్ఛాయుత స్వప్నాలే పంచరంగులు. ఆమె కుంచె సందేశాత్మకంగా రంగులద్దిన దేహాలు.. మనతో మాట్లాడుతాయి. ప్రతి చిత్రంలోనూ ఓ ఉద్వేగం తొంగిచూస్తుంది. ఈ హైదరాబాదీ చిత్రకారిణి అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నట్టు ‘అభిజ్ఞ’ వర్గాల భోగట్టా!

కళాకారులకు పరిమితులు ఉండవని మరోసారి నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన అభిజ్ఞ వేమూరు కాసా. తనువులే కాన్వాస్‌గా స్త్రీవాద భావాలను స్వేచ్ఛగా ప్రకటిస్తున్నది అభిజ్ఞ. పురాణాల్లోని స్త్రీమూర్తులు మొదలు ఆధునిక స్త్రీల వరకూ ప్రతి మగువా ఆమె అభివ్యక్తికి ఒక వస్తువే. తరాల సంప్రదాయాన్ని గౌరవిస్తూనే.. స్త్రీని వంటింటికి పరిమితం చేసే మూఢనమ్మకాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

తనువును క్యాన్వాస్గా మలుచుకొని తన వాణిని వినిపిస్తూ.. కాదేదీ కళకు అనర్హం అంటున్నది అభిజ్ఞ. పురాణాలు, జానపద కథలు, చరిత్రలోని స్త్రీ పాత్రలను, సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందినవారి జీవనయానాన్నీ చిత్రకళ ద్వారా బంధిస్తున్నది. ఇందుకోసం సహజమైన రంగులను మాత్రమే ఉపయోగిస్తున్నది. అభిజ్ఞ గీసే ప్రతి చిత్రం స్త్రీవాదానికి సంబంధించి ఏదో ఒక సందేశాన్ని చాటుతుంది. అభిజ్ఞ చిత్రకళకు మెడ, చేతులు, వీపు, ముఖ భాగాలే కీలకం. వాటితోనే పదునైన సందేశం ఉంటుంది. ఓ వ్యక్తి జీవిత కథ వినిపిస్తుంది. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగోలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన అభిజ్ఞ.. ఆ తర్వాత లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో పట్టా అందుకుంది. తన కళను సరికొత్తగా ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ‘బాడీ ఆర్ట్’ను అస్త్రంగా మలుచుకున్నది. పెండ్లి తర్వాత కళాకారిణిగా ఆమె మరింత పురోగతి సాధించింది. ఓ తల్లిగా మాతృత్వపు భావాలను కూడా తనదైన శైలిలో వ్యక్తపరుస్తున్నది అభిజ్ఞ.

…✍రవికుమార్ తోటపల్లి ( డప్పు రవి )
Read More :
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- ART
- inspiration
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

