ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా ఈ నెల 11న విడుదలకు
సిద్ధమవుతున్నది. తెలుగులో ఈ సినిమాను హీరో చిరంజీవి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్‌ను హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు ఆమిర్ ఖాన్, నాగార్జున, నాగ చైతన్య, అల్లు అరవింద్, సురేష్ బాబు, సాయి ధరమ్‌తేజ్, దర్శకులు మారుతి, హరీష్ శంకర్ తదితరులు హాజరయ్యారు.