దుబాయ్: పాకిస్థాన్‌పై ఆసియాకప్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న హార్ధిక్ పాండ్యాపై అతని భార్య నటాషా స్టాన్కోవిక్ కామెంట్లతో హోరెత్తించింది. పాక్‌తో మ్యాచ్‌లో నెగ్గిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టాటస్‌లో హార్ధిక్ ఫోటోలను నటాషా పోస్టు చేసింది. తొలుత బౌలింగ్‌లో హార్దిక్ రాణించాడు. 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి కీలకమైన మూడు వికెట్లను తీసుకున్నాడు. ఐసీసీ పోస్టు చేసిన ఓ ఫోటోను ట్యాగ్ చేసిన నటాషా.. యూ ఆర్ మై స్టార్ అంటూ కామెంట్ చేసింది. స్టార్ ఎమోజీని దాంట్లో పోస్టు చేసింది. ఇక ఆ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, విన్నింగ్స్ మూమెంట్స్‌ను కూడా నటాషా షేర్ చేసింది. ఓ ఫోటోకు గర్వంగా ఉన్నట్లు కామెంట్ చేసింది. ఆ ఫోటోకు హార్ట్, స్టార్ ఎమోజీని కూడా జోడించింది. ఆఖర్లో హార్దిక్ కొట్టిన విన్నింగ్ సిక్సర్ వీడియోను కూడా నటాషా తన స్టేటస్‌లో పెట్టుకున్నది. హార్ధిక్ 17 బంతుల్లో 33 రన్స్ చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.