Hema Malini: హ్యాపీ బర్త్‌డే మై డియర్ హార్ట్: హేమామాలినీ
Hema Malini: దివంగత నటుడు ధర్మేంద్ర 90వ పుట్టిన రోజు ఇవాళ. నటి హేమామాలినీ తన ఎక్స్ అకౌంట్లో భావోద్వేగ పోస్టు చేశారు. ధరమ్ జీ .. హ్యాపీ బర్త్‌డే మై డియర్ హార్ట్ అంటూ ఆమె పోస్టులో రాశారు.
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర నవంబర్ 24వ తేదీన మృతిచెందిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ దివంగత నటుడి 90వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ధర్మేంద్ర భార్య, నటి హేమామాలినీ(Hema Malini) తన ఎక్స్ అకౌంట్లో భావోద్వేగ పోస్టు చేశారు. ధరమ్ జీ .. హ్యాపీ బర్త్‌డే మై డియర్ హార్ట్ అంటూ ఆమె పోస్టులో రాశారు. ముంబైలోని జూహూలో ధర్మేంద్ర ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భౌతికంగా మీరు దూరమై రెండు వారాలు అయ్యిందని, నా గుండెను మీరు బ్రేక్ చేశారని, చిన్న చిన్నగా మళ్లీ తన జీవితాన్ని పునర్ నిర్మించుకుంటున్నట్లు హేమామాలినీ తన పోస్టులోచెప్పారు.
నా ఆత్మీలో మీరెప్పుడూ ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. మన జీవితంలో గడిపిన మధుర స్మృతులు ఎన్నటికీ చెరిగిపోవు అని, ఆ జ్ఞాపకాలు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఒక్కటిగా గడిపేలా చేసిన ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆమె తెలిపారు. మన ఇద్దరు అమ్మాయిల ప్రేమ, అప్యాయత మదురమైందన్నారు.ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నా గుండెలో ఉండిపోతాయన్నారు.
నీకు శాంతిని, సంతోషాన్ని ఇవ్వాలని ఆ దేవుడి ప్రార్థిస్తున్నట్లు ఆమె తన పోస్టులో చెప్పారు. నీ మంచి హృదయం, మానవత్వం పట్ల ఉన్న నీ ప్రేమ అమోఘమైందన్నారు. హ్యాపీ బర్త్‌డే డియర్ లవ్ అంటూ లవ్ ఎమోజీ సింబల్‌ను పోస్టు చేశారామె.
ధర్మేంద్ర, హేమామాలినీ.. 1980లో పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ ఈషా, అహనా పిల్లలు ఉన్నారు. తొలి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్రకు నలుగురు పిల్లలు ఉన్నారు. ధర్మేంద్రతో దిగిన కొన్ని ఫోటోలను పోస్టు చేసిన హేమమాలినీ మన సంతోషకర సందర్భాలు అని ట్యాగ్ చేసింది.
Dharam ji
Happy birthday my dear heart❤️
More than two weeks have passed since you left me heartbroken, slowly gathering up the pieces and trying to reconstruct my life, knowing that you will always be with me in spirit. The joyful memories of our life together can never be… pic.twitter.com/zY3QBJN0YE— Hema Malini (@dreamgirlhema) December 8, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

