జీన్స్ అంటే ఇష్టముండని వారుండరు.. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వాడుతారు. కర్టెన్లు, బ్యాగులతో సహా ఇతర ఉత్పత్తులకు జీన్స్ క్లాత్ ఉపయోగపడుతున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ క్లాత్‌ను చేనేత మగ్గం ఎక్కించింది హన్మకొండ జిల్లా కమలాపురం చేనేత సహకారం సంఘం. అసలుకు తీసిపోని విధంగా జీన్స్‌ను రూపొందిస్తున్నారు. రాష్ట్ర చేనేత ఔళి శాఖ దృష్టిలో పడటంతో.. ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ప్రోత్సహించి నిపుణులతో వీరికి శిక్షణ ఇప్పిస్తోంది. చేనేతలు నేస్తున్న జీన్స్ గురించి తెలుసుకున్న పలు వస్త్ర దుకాణాలు .. ప్రత్యేకంగా ఆర్డర్ కూడా ఇస్తున్నాయి. మరి మగ్గాలపై వారు జీన్స్ ఎలా నేస్తున్నారో ఈ వీడియోలో చూడండి..