లైంగిక భాగస్వామికి చప్పట్లతో సంకేతం.. సీల్స్‌పై అధ్యయనంలో వెల్లడి!

హైదరాబాద్: సీల్స్..! ఈ సముద్ర జీవులకు వెనుక భాగాన రెండు, ముందు భాగాన రెండు ఈదడానికి తోడ్పడేలా తెడ్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ సీల్స్ వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో బూడిదరంగు సీల్స్ (గ్రే సీల్స్)పై జరిగిన అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. సంగమించాలనుకున్న సందర్భంలో ఈ సీల్స్ చప్పట్లతో సహచరికి సంకేతాలిస్తాయట. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం గ్రే సీల్స్‌పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.
సీల్స్‌లో సాధారణంగా మగ జీవి 150 నుంచి 300 కిలోల బరువుతో రెండున్నర మీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఆదేవిధంగా ఆడ జీవి 100 నుంచి 200 కిలోల బరువుతో రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. వీటి దేహం కింద ఉదర భాగంలో ముందువైపు ఒక జత పూర్వాంగాలు, వెనుకవైపు ఒక జత చరమాంగాలు ఉంటాయి. సీల్స్ నీటిలో ఈదడానికి తోడ్పడే ఈ పూర్వచరమాంగాలు వేళ్లులేకుండా తెడ్లవలె ఉంటాయి.

అయితే, నీటిలో ఈదడానికి తోడ్పడే ఈ తెడ్లలాంటి నిర్మాణాల్లో పూర్వాంగాలను గ్రే సీల్స్ చేతుల్లా ఉపయోగించి చప్పట్లు కొడుతాయట. సాధారణంగా జంతుప్రదర్శన శాలల్లోని నీటిలో ఉండే సీల్స్ కూడా చప్పట్లు కొడుతాయి. అయితే సందర్శకుల ఆనందం కోసం జూ నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో వాటికి ఆ చప్పట్లు కొట్టడం అనే లక్షణం ఒంటబడుతుంది. కాబట్టి అందులో వింతేమీ లేదు.
కానీ సముద్రాల్లోని గ్రే సీల్స్కు ఎలాంటి శిక్షణ లేకపోయినా చప్పట్లు కొడుతాయి. అదీ నీటి లోపలిభాగంలో ఎలాంటి గాలి లేకపోయినా, తుపాకీ పేలినంత పెద్దగా శబ్దం వచ్చేలా చప్పట్లు కొడుతాయట. సాధారణంగా కమ్యూనికేషన్ కోసం సీల్స్ రకరకాల శబ్దాలు చేస్తాయట. అయితే ఈ చప్పట్లు కొట్టడం అనే లక్షణం కూడా కమ్యూనికేషన్ కోసమే అయినా వాటి భాషలో దానికి అర్థం వేరేనట. చప్పట్లతో చేసే ఈ కమ్యూనికేషన్‌కు తాను సంగమం కోసం తహతహలాడుతున్నా అనే సంకేతం దాగి ఉందట.
ఈ చప్పట్ల ద్వారా మగ గ్రే సీల్ తన పరిసరాల్లో ఉన్న సీల్స్కు రెండు రకాల సందేశాలిస్తుందట. అందులో మొదటిది.. ‘నేను చాలా బలవంతుడిని, నా దరిదాపుల్లోకి ఎవరూ రావద్దు’ అనే హెచ్చరికనట. తాను ఆడ సీల్‌ను సమీపించడానికి ముందే దాని చుట్టుపక్కల ఉన్న ఇతర మగ సీల్స్‌ను భయపెట్టడానికి అలా చేస్తుందట. ఇక రెండోది.. ‘నేను చాలా బలవంతుడిని, నాలో చాలా చక్కని జీన్స్ ఉన్నాయి’ అనే ఆహ్వానమట. నీతో సంగమానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆడ సీల్‌ను ఆకర్షించడానికి ఇలా చేస్తుందట.
ఇలా మగ సీల్ చప్పట్ల శబ్దం వినగానే దానికంటే బలహీనంగా ఉండే ఇతర మగ సీల్స్ అక్కడి నుంచి పారిపోతాయట. ఆడ సీల్ వచ్చి తన సరసన చేరుతుందట. ఆ తర్వాత అవి సంగమ క్రీడలో మునిగి తేలుతాయట. కాగా, చప్పట్లు కొట్టడం అనేది గ్రే సీల్స్‌లో అతి ముఖ్యమైన సామాజిక ప్రవర్తన అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డా. డేవిడ్ హాకింగ్. ముఖ్యమైన విషయం ఏందంటే.. గ్రే సీల్ చప్పట్లు కొట్టే దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం కోసం బ్రిటన్‌కు చెందిన ప్రకృతి ప్రేమికుడు డా. బెన్ బర్విల్లే 17 ఏండ్లు శ్రమించాల్సి వచ్చిందట.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Clapps
- Grey seals
- Mating
- Seals
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

