నానమ్మే నా బలం!
శుభశ్రీ.. గిటార్ పడితే సరిగమలు సెలయేరులా పారుతాయి. ఆ స్వరాలను వింటున్నప్పుడు మన ప్రమేయం లేకుండానే కాళ్లు లయబద్ధంగా కదులుతాయి. మునివేళ్లతో ఆమె ఇచ్చే ముక్తాయింపునకు చేతులు కరతాళ ధ్వనులు చేసితీరతాయి. కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు గట్టి పునాదులే వేసుకుంటున్నది గిటారిస్ట్ శుభశ్రీ జైక్. గిటార్ గురించి, పాటల నానమ్మ సుశీలమ్మ గురించి చాలా కబుర్లే చెబుతున్నది శుభశ్రీ..
తరాలుగా మా కుటుంబం సంగీత ప్రపంచంలోనే ఉంది. నానమ్మ పి.సుశీల తనదైన గళంతో చిత్ర పరిశ్రమను ఎలా శాసించారో చూస్తూ పెరిగాను. నాకు సంగీతం మీద ఇష్టం పెరగడానికి నానమ్మే కారణం. నాకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు ఇంటికి ఓ అందమైన గిటార్ తీసుకొచ్చారు. అప్పటినుంచి నా ఆటపాటలన్నీ దానితోనే. గిటార్ మీద సంగీతాన్ని ఎలా పలికించాలన్నది నానమ్మే నేర్పారు.
ఇంటర్నెట్ నా సంగీత గురువు. అధికారికంగా ఎలాంటి శిక్షణా తీసుకోకపోయినా నెట్ నుంచి చాలా నేర్చుకున్నాను. సెలవులకు చెన్నై వెళ్లినప్పుడు సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ గిటారిస్ట్ సదాసుదర్శనం గారితో కొంత సమయం గడిపేదాన్ని. వాళ్లు గిటార్ పలికించే విధానం.. నా హృదయానికి హత్తుకునేది. ఇప్పుడు నేను పియానో కూడా వాయించగలను.
టాలీవుడ్లో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగీత దర్శకుడు తమన్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అల వైకుంఠపురములో, భీమ్లానాయక్, రాధేశ్యామ్ వంటి సినిమాలకు గిటారిస్ట్‌గా చేశాను. తమన్ చాలా కూల్పర్సన్. ఫ్రెండ్లీగా ఉంటారు. ఏఆర్ రెహమాన్ సర్, అనిరుధ్తోనూ కలిసి పనిచేశాను. వరుణ్‌తేజ్ ‘గని’సినిమాలో నన్ను గిటారిస్ట్‌గా పరిచయం చేశారు తమన్.
నానమ్మ ప్రేమను పొందడం చాలా అదృష్టంగా భావిస్తాను. ‘మున్ముందు మంచి ప్రశంసలు అందుకుంటావు’ అని ఎన్నోసార్లు ఆశీర్వదించారు నానమ్మ. ఆమె ఒంటరిగానే ఓ సంగీత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆ కీర్తిని కాపాడటమే నా తక్షణ కర్తవ్యం. భవిష్యత్‌లో సంగీత దర్శకురాలిని అవుతానేమో. కానీ, నేను నేర్చుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. భీమ్లానాయక్, గని, రాధేశ్యామ్ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

