ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరల నియంత్రణ పై కేంద్రం దృష్టి..

ఢిల్లీ ,జూన్ 4: కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల ఫలితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరల అస్థిరతను దృష్టిలో పెట్టుకుని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధరలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్ లెవల్ లో మార్జిన్ 198శాతం ఉంది.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డిపిసిఒ, 2013లోని పారా 19 కింద అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై పంపిణీదారు స్థాయిలో ధర(పిటిడి) పై వాణిజ్య మార్జిన్‌ను 70శాతంగా ఎన్‌పిపిఎ నియంత్రించింది. ఇంతకుముందు, ఎన్‌పిపిఎ యాంటీ-కాన్సర్ మందులపై వాణిజ్య మార్జిన్‌ను ఫిబ్రవరి 2019లో విజయవంతంగా నియంత్రించింది. నోటిఫై చేసిన వాణిజ్య మార్జిన్ ఆధారంగా సవరించిన ఎంఆర్‌పిని మూడు రోజుల లోపల నివేదించవలసిందిగా ఎన్‌పిపిఎ ఉత్పత్తిదారులను, దిగుమతిదారులను ఆదేశించింది. సవరించిన ఎంఆర్పి ధరలను ఎన్‌పిపిఎ వారం రోజులలో వెల్లడించనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

