French President | ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. ఆయన బసచేసిన హోటల్ దగ్గర భారీ పేలుళ్లు
French President | సిరియా పర్యటన (Siriya Visit) లో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు (France President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) కు పెను ప్రమాదం తప్పింది. రాజధాని డమస్కస్‌లో ఆయన బసచేసిన హోటల్ సమీపంలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ఘటనలో మాక్రాన్ సురక్షితంగా ఉన్నారని, పేలుళ్ల తర్వాత కూడా ఆయన తన పర్యటనను యథావిధిగా కొనసాగించారని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ప్రకటించింది.
French President : సిరియా పర్యటన (Siriya Visit) లో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు (France President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) కు పెను ప్రమాదం తప్పింది. రాజధాని డమస్కస్‌లో ఆయన బసచేసిన హోటల్ సమీపంలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ఘటనలో మాక్రాన్ సురక్షితంగా ఉన్నారని, పేలుళ్ల తర్వాత కూడా ఆయన తన పర్యటనను యథావిధిగా కొనసాగించారని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ప్రకటించింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. డమస్కస్‌లోని మాక్రాన్ బస చేసిన హోటల్‌కు సమీపంలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనను సిరియా భద్రతా వర్గాలు ధ్రువీకరించాయి. పేలుళ్ల అనంతరం అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులను మూసివేసి భద్రతను కట్టుదిట్టంచేశారు. సంఘటనా స్థలం నుంచి పొగలు వస్తున్నట్లు రాయిటర్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పేలుళ్లు జరిగిన సమయంలో మాక్రాన్ తన కాన్వాయ్‌లో వేరే కార్యక్రమానికి వెళుతున్నారని, ఆయనకు పేలుళ్ల శబ్దం కూడా వినిపించలేదని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పష్టంచేసింది.
మాక్రాన్‌తో పాటు ఉన్న రాయిటర్స్ జర్నలిస్ట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ ఘటన జరిగినప్పటికీ మాక్రాన్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు. 2024లో బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత, ఒక యూరోపియన్ యూనియన్ దేశాధినేత సిరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అల్-షరా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దేశంలో భద్రతాపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మాక్రాన్ పర్యటన సందర్భంగా జరిగిన ఈ పేలుళ్లు అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత తీసుకోలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

