తిరుమలలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

తిరుమల,జూలై :లోక కల్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న ఆషాడ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఏకాదశి విశేషమైనది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో దక్షిణాయన పుణ్యకాలంలో ఆషాడ మాసం శుక్ల ఏకాదశికి ఘనమైన పురాణ వైశిష్ట్యం ఉంది.

ఈరోజు పాల సముద్రంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనిస్తారని, అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి నాడు భగవంతుని స్మరణ చేస్తే 10ఏండ్లు స్మరించిన ఫలితం దక్కుతుందని పండితులు తెలిపారు. పచ్చని తోరణాలు, పుష్పాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన వసంత మండపంలో స్వర్ణపీఠంపై శ్రీ రుక్మిణీ సమేతంగా కృష్ణస్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం పురాణ పండితులు శ్రీ రామకృష్ణ శేషసాయి శయన ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఆ తరువాత అర్చకస్వాములు, వేదపండితులు పారమాత్మికోపనిషత్ లోని శ్రీకృష్ణ మూలమంత్రం, గాయత్రీ మంత్రాన్ని 24 సార్లు పఠించారు. పుష్పార్చన చేసి తులసీదళాలతో సహస్రనామార్చన చేపట్టారు. నివేదన, హారతులు సమర్పించి క్షమాప్రార్థన చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

