అధిక రక్షణ కోసం డబుల్ మాస్కులు

వాషింగ్టన్: ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడే రక్షణ కవచమే మాస్కు. అయితే అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) స్పష్టం చేసింది. రోగాల నిర్ధారణ, నివారణ, చికిత్స విధానాలకు సంబంధించి అమెరికాలో ఇదే అత్యున్నత నిర్ణాయక సంస్థ. సర్జికల్ మాస్కు.. దాని మీద కాటన్ మాస్కు ధరిస్తే అధిక రక్షణ ఉంటుందని సీడీసీ జరిపిన అద్యయనంలో తేలింది. అవతలి వ్యక్తులు దగ్గడం వల్ల, ఊపిరి తీయడం వల్ల వెలువడే సూక్ష్మ తుంపరలు ముక్కులోకి వెళ్లలేదని ఈ అధ్యయనంలో తేలిన ముఖ్యమైన విషయం. అయితే మాస్కులు రెండూ సరిగా అమరాయా.. శ్వాస ఆడుతోందా.. దృష్టికి ఆటంకం ఏమీ లేదు కదా అనే విషయాలు సరి చూసుకోవాలి. కరోనా రెచ్చిపోతున్న వేళ ఈ మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. అది కూడా ఇతరుల సమక్షంలో తప్పక పాటించాలి. ఇక భౌతిక దూరం, అవసరమైతేనే బయటికి వెళ్లడం వంటి కరోనా నిబంధనలను ఈ ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు తప్పకుండా పాటించి తీరాల్సిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

