‘బంగార్రాజు’ చిత్రంతో సంక్రాంతికి చక్కటి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కుటుంబ విలువలతో సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారాయన. తన తదుపరి సినిమాను కల్యాణ్‌కృష్ణ స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నారు. ఈ చిత్రానికి కె.ఇ. జ్ఞానవేళ్‌రాజా నిర్మాత. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘కల్యాణ్‌కృష్ణతో మా బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని తెలిపారు.