ప్రతి విజయం కొత్త ఉత్సాహం
నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ‘రామాయణం’ వెయ్యికోట్ల వసూళ్లు సాధించింది. అలాగే.. సూర్య ‘సీన్' చిత్రం విజయపథంలో దూసుకుపోతూ సూర్య కెరీర్లోనే హయ్యెస్ట్ రెవెన్యూ సాధిస్తున్నది.
నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ‘రామాయణం’ వెయ్యికోట్ల వసూళ్లు సాధించింది. అలాగే.. సూర్య ‘సీన్’ చిత్రం విజయపథంలో దూసుకుపోతూ సూర్య కెరీర్లోనే హయ్యెస్ట్ రెవెన్యూ సాధిస్తున్నది. ఈ రెండు సినిమాలనూ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేసింది అగ్ర నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. తాను విడుదల చేసిన రెండు సినిమాలూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా శుక్రవారం నిర్మాత దిల్‌రాజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ‘ ‘రామాయణం’ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేసినందుకు గర్వంగా ఉంది. ప్రతి సక్సెస్ నుంచీ ఒక కొత్త ఎనర్జీని తెచ్చుకోవాలి. అదే నా ఫార్ములా. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని చెప్పారు దిల్‌రాజు. తాను విడుదల చేసిన మరో సినిమా ‘సీన్’ గురించి మట్లాడుతూ ‘సూర్య ‘సీన్’ని నైజాంలో విడుదల చేశాం. సూర్య నటన, జీతూ మాధవన్ ఎక్స్ట్రార్డినరీ స్క్రీన్‌ప్లే వర్కవుట్ అయ్యాయి. సూర్య కెరీర్లోనే హయ్యెస్ట్ రెవిన్యూ క్రియేట్ చేస్తున్నదీ సినిమా. ఈ రెండు సినిమాల విజయాలూ మాకు గొప్ప ఆనందాన్నిచ్చాయి’ అని దిల్ రాజు సంతోషం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

