ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా..
Delhi Mayor elections: ఢిల్లీ మున్సిపాలిటీలో ఆప్, బీజేపీ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మేయర్ ఎన్నిక కోసం జరిగిన మూడవ సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది. ఆప్ ఆందోళనతో ఎన్నికను వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఇవాళ మూడోసారి ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. అయితే ఓటింగ్ హక్కుల అంశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో మేయర్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత బీజేపీ తన ఆధిపత్యాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
నామినేట్ అయిన 10 మంది కౌన్సిలర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొనేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ వ్యతిరేకిస్తున్నది. దీంతో మేయర్ ఎన్నిక సమయంలో ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ కారణంగా రెండు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ కూడా అదే తరహా సీన్ రిపీటైంది. డీఎంసీ చట్టాన్ని సక్సేనా అతిక్రమించినట్లు ఆప్ ఆరోపిస్తున్నది.
250 వార్డులు ఉన్న ఢిల్లీలో.. 134 సీట్లు ఆప్ గెలవగా.. 104 సీట్లను బీజేపీ సొంతం చేసుకున్నది. ఢిల్లీలోని బీజేపీకి చెందిన ఏడు లోక్‌సభ ఎంపీలు, ఆప్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. జనవరి ఆరో తేదీన జరిగిన మేయర్ ఎన్నిక తొలి సమావేశంలో బీజేపీ, ఆప్ నేతలు కొట్టుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

