‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’
‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’ | దేశ రాజధానిలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తెలిపారు. స్టేడియంలో మే 2వ తేదీ వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆటగాళ్లు కరోనా బారినపడడంతో టోర్నీని బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీకాలు వేసేందుకు మరో కేంద్రం అవసరమని భావిస్తే.. స్టేడియాన్ని టీకా కేంద్రంగా మార్చితే ఇక్కడ ప్రతి రోజు కనీసం పదివేల మందికి వ్యాక్సిన్లు వేయొచ్చని చెప్పినట్లు రోహన్ పేర్కొన్నారు.
సాధారణ స్థితికి వచ్చే వరకు స్టేడియాన్ని వాడుకోవచ్చన్నారు. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని పరిశీలిస్తామని సమాధానం ఇచ్చినట్లు రోహన్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 864 టీకా కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం టీకాలు వేస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్ శనివారం మాట్లాడుతూ నగరంలో కరోనా ప్రభావం తగ్గిందని, పాజిటివిటీ రేటు 11శాతానికి పడిపోయిందని తెలిపారు. నిన్న ఢిల్లీలో 6,500 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

