Dhadkan | కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా ‘ధడ్కన్’ విడుదలై 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా ‘ధడ్కన్’ విడుదలై 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో ధర్మేష్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, నేటికీ తన సంగీతం, డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘ధడ్కన్ 2’ పేరుతో ఈ సినిమాకు కొనసాగింపు లేదా రీబూట్ తీసుకురావడానికి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘బత్తి గుల్ మీటర్ చాలు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.
అయితే, ఈ కొత్త ప్రాజెక్ట్ పాత కథకు నేరుగా కొనసాగింపు కాకుండా, ‘ధడ్కన్’ తరహాలోనే ప్రేమ, విరహం వంటి భావోద్వేగాల చుట్టూ తిరిగే సరికొత్త కథాంశంతో ఉండనుంది. ఇందులో అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి స్థానంలో పూర్తిగా కొత్త జంటను తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒక ప్రముఖ దర్శకుడి కుమారుడిని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు, ఒరిజినల్ చిత్రంలో ‘దేవ్’ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సునీల్ శెట్టి ఈ సీక్వెల్లో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhadkan | కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

