Cristiano Ronaldo | బర్త్ డేకు మూడు కేకులు కట్ చేసిన రొనాల్డో.. ఇన్‌స్టాలో ఫొటోలు వైరల్
పోర్చుగల్, అల్ నస్రీ క్లబ్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో బర్త్ డే ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 5న ఈ స్టార్ ప్లేయర్ 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
Cristiano Ronaldo : పోర్చుగల్, అల్ నస్రీ క్లబ్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో బర్త్ డే ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 5న ఈ స్టార్ ప్లేయర్ 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల సమక్షంలో అతను పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మూడు కేకులు కట్ చేశాడు. ఈ స్టార్ ఆటగాడి వెంట ప్రేయసి జార్జినా రోడ్రిగ్, పెద్ద కుమారుడు క్రిస్టియానో జూనియర్ కూడా ఉన్నారు. కేకు కట్ చేసిన అనంతరం ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోలను అతను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు స్నేహితులు, కుటుంబసభ్యులతో గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని క్యాప్షన్ రాశాడు.
ప్రస్తుతం రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్‌కు ఆడుతున్నాడు. శుక్రవారం రాత్రి అల్ ఫతేహ్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చివరి నిమిషంలో గోల్ చేశాడు. పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టును ఆదుకున్నాడు. దాంతో, ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ స్టార్ ఆటగాడిని అల్ నస్రీ క్లబ్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 4400 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అంతకుముందు రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

