గేటు దూకి జంతర్ మంతర్‌లోకి.. పోలీసుల అదుపులో సీజేపీ నాయకులు
నిరసన ప్రదేశంగా గుర్తించిన జాబితా నుంచి అధికారులు తొలగించిన జంతర్ మంతర్‌లోకి గేటు దూకి ప్రవేశించినందుకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాను మంగళవారం డిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఇతర మద్దతుదారులతో పాటు సీజేపీ కార్యకర్త అజింక్యా షిండేను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు కావడానికి ముందు రాంకా ఎక్స్‌లో ఒక వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. అందులో, తాను, దాస్, ఇతర సీజేపీ మద్దతుదారులు ఒక గేటు పైనుంచి దూకి జంతర్ మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది.
ఆయన ఆ వీడియోకు జంతర్ మంతర్ జోలికి రావద్దు అని శీర్షిక పెట్టారు. జంతర్ మంతర్ సమీపంలోని జనతాదళ్(యునైటెడ్) కార్యాలయ ప్రాంగణం వైపు నుంచి ఆ బృందం నిరసన స్థలంలోకి ప్రవేశించినట్టు తెలుస్తున్నది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన వారినందరినీ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తమను అదుపులోకి తీసుకుంటున్నప్పుడు రాంకా, ఇతర సీజేపీ మద్దతుదారులు ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తున్న వీడియోను కూడా దాస్ ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. జంతర్ మంతర్‌ను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించిన ఆయన లోపలికి ప్రవేశించడాన్ని యువతరానికి ఒక సందేశంగా అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

