Jalpaiguri : రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం
Jalpaiguri : రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం | పశ్చిమ బెంగాల్లో రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వే (ఎన్జేపీ) స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించారు. వెంటనే స్థానిక రైల్వే పోలీసులు సీఐడీకి సమాచారం అందించారు. వెంటనే బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వే (ఎన్జేపీ) స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక రైల్వే పోలీసులు సీఐడీకి సమాచారం అందించారు. సీఐడీకి చెందిన బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేసింది. బాంబు దేశీయంగా తయారు చేసిందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని న్యూ జల్పాయిగురి స్టేషన్ రైల్వే పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఏజీ ఫరూఖ్ పేర్కొన్నారు. భయాందోళనలు సృష్టించాలనే లక్ష్యంతో రైల్వేస్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. బాంబు ఘటనతో భద్రతా ఏర్పాట్లు పెంచి, రైల్వేస్టేషనులో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బాంబు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

