భరత్ కీపింగ్ అద్భుతం: లక్ష్మణ్

కాన్పూర్: గతంలోనే తనకు కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ నైపుణ్యాల విషయమై రాహుల్ ద్రవిడ్ ప్రస్తావించాడని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. వృద్ధిమాన్ సాహా తర్వాతి స్థానం భరత్దేనని చెప్పినట్లు గుర్తు చేశాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ మూడో రోజు సాహాకు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన తెలుగు క్రికెటర్ భరత్ అద్భుతంగా కీపింగ్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఈ సందర్భంగా అతనిపై లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ‘భరత్ కీపింగ్ నైపుణ్యాలు బాగున్నాయని కొన్నాళ్ల కిందట ద్రవిడ్ చెప్పాడు. ఇప్పుడు అదే ప్రధాన కోచ్, సెలెక్టర్ల విశ్వాసాన్ని భరత్ చూరగొన్నాడు. స్పిన్ పిచ్‌లపై సరైన కీపర్ లేకుంటే చాలా నష్టపోతాం. భరత్ ప్రదర్శన అత్యద్భుతం. ఇది అతడికి మంచి అనుభవంగా పనికొస్తుంది. అతడి కెరీర్ మున్ముందుకు సాగడానికి దోహదం చేస్తుంది. ఈ ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని అన్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్‌గా కేఎస్ భరత్ దేశవాళీ క్రికెట్లో 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4,283 పరుగులు చేశాడు. 9 శతకాలు, 23 అర్ధ శతకాలు సాధించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bharat Keeping
- Lakshman
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

