హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారిని నివారించేందుకు ప్రపంచంలోనే తొలిసారి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) అభివృద్ధి చేసిన చుక్కల మం దు (ముక్కు ద్వారా తీసుకొనే టీకా) ‘ఇన్కోవాక్’ను ఇకపై బూస్టర్ డోసుగానూ వినియోగించుకోవచ్చు. అందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) అనుమతులు మంజూరైనట్టు బీబీఐఎల్ సోమవారం ప్రకటించింది. 18 ఏండ్ల కంటే ఎకువ వయస్సున్నవారు అత్యవసర పరిస్థితుల్లో దీనిని వినియోగించేందుకు పరిమిత స్థాయిలో అనుమతులు మంజూరైనట్టు వెల్లడించింది. ఇప్పటికే కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్‌ను రెండు డోసులు తీసుకొని 6 నెలల దాటినవారు మాత్రమే ఇన్కోవాక్ను బూస్టర్ డోసుగా తీసుకోవాలని మార్గదర్శకాలు జారీచేసినట్టు తెలిపింది. ప్రస్తు తం కొవిడ్ వ్యాక్సిన్లకు పెద్దగా డిమాండ్ లేనప్పటికీ భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులను అడ్డుకొనేందుకు ఇన్కోవాక్ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు.