లవ్ బాంబ్ పడిందా?
ప్రేమ మధురానుభూతి. తీయని మత్తు. ఎదుటివాళ్లను ఆ మైకంలో పడేసి కీలు బొమ్మగా మార్చు కోవాలని చూసేవారూ ఉంటారు. తొలుత అంతా బాగానే అనిపించినా.. క్రమంగా ఆ బంధం హింసాత్మకం అవుతుంది. దీన్నే ‘లవ్ బాంబింగ్' అని పిలుస్తున్నారు. ఏది అసలైన ప్రేమో, ఏది లవ్ బాంబింగో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు.
ప్రేమ మధురానుభూతి. తీయని మత్తు. ఎదుటివాళ్లను ఆ మైకంలో పడేసి కీలు బొమ్మగా మార్చు
కోవాలని చూసేవారూ ఉంటారు. తొలుత అంతా బాగానే అనిపించినా.. క్రమంగా ఆ బంధం హింసాత్మకం అవుతుంది. దీన్నే ‘లవ్ బాంబింగ్’ అని పిలుస్తున్నారు. ఏది అసలైన ప్రేమో, ఏది లవ్ బాంబింగో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు.
బహుమతులు అందుకుంటున్నప్పుడు సంతోషంగానే ఉంటుంది. కానీ అస్సలు ఊహించని లేదా ఏమాత్రం అవసరంలేని విలువైన బహుతులు ఇస్తున్నారంటే మాత్రం ఓసారి ఆలోచించాల్సిందే. ఖరీదైన ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, ఒకటికి పది బొకేలు పంపడం.. ఇలాంటి ఎత్తులే. వీటిని తీసుకోవడం ద్వారా వారికి రుణపడి ఉన్నామన్న భావన కలిగిస్తారు.
పొగడ్త మిఠాయిలా తియ్యగా ఉంటుంది. కానీ ఎవరైనా విపరీతంగా కీర్తిస్తున్నారంటే ఏదో తేడా ఉన్నట్టు లెక్క. లవ్బాంబింగ్ చేసే వ్యక్తులు ‘నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది’, ‘అసలు నీలాంటి మనిషిని ఇప్పటి వరకూ కలవనే లేదు’, ‘నాకు రోజంతా నీతోనే గడపాలనుంది’..లాంటి అతిమాటలు మాట్లాడతారు.
నిరంతరం ఫోన్లు చేయడం, క్షేమ సమాచారం తెలుసుకోవడానికి అన్నట్టు మాటిమాటికీ మెసేజ్లు పెట్టడం.. ఓ మెత్తని కుట్ర. మీరు ఎక్కడున్నా సరే మొత్తం సమయాన్ని తమకే కేటాయించేలా ఓ వ్యూహం.
మీరు వేరే మనిషి గురించి మాట్లాడినా ఓర్చుకోలేరు. మిత్రుల్ని కలవాల్సి ఉందని చెప్పినా కదలనివ్వరు. నిజమైన ప్రేమ నీ పూర్తి సమయాన్నీ, శక్తినీ, ధ్యాసనీ…సర్వస్వాన్నీ ఎప్పుడూ కోరుకోదు. వ్యక్తిగత కమిట్మెంట్స్కు కూడా విలువ ఇస్తుంది.
మెసేజ్కి రిైప్లె ఇవ్వకపోతే అలుగుతారు. ఎక్కడికి వెళ్లాలన్నా తోడుగా వస్తారు. వాళ్లు లేకుండా కదలలేని పరిస్థితి కల్పిస్తారు. మొదట్లో బాగానే ఉన్నా, తర్వాత తర్వాత మీ ప్రపంచం మీకే ఇరుకుగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరో అధీనంలోకి తీసుకున్న భావన కలుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- beware
- life
- love bombing
- romance
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

