ఇటీవల ఘనవిజయం సాధించిన ‘పుష్ప’ చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో నటించిన ధనుంజయ్ నటించిన కన్నడ చిత్రం ‘బడవరాస్కెల్’. ఇప్పుడు ఈ చిత్రాన్ని డాలీపిక్చర్స్ అండ్ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నిర్మాత సావిత్రమ్మ అడవి స్వామి మాట్లాడుతూ ‘ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. అమృత అయ్యంగార్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: గీత శివరాజ్‌కుమార్.