సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పెళ్లి చేసుకున్నాడు. బెకీ బోస్టన్‌ను అతను మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. జస్ట్ మ్యారీడ్ అని తన ఫోటోకు ట్యాగ్ చేశాడు. టీమ్మేట్స్ కమ్మిన్స్‌కు విషెస్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్‌తో పాటు ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ప్యాట్ కమ్మిన్స్‌కు కంగ్రాట్స్ తెలిపింది. కమ్మిన్స్, బోస్టన్ జంటకు 9 నెలల చిన్నారి కూడా ఉన్నాడు. టెస్ట్ బౌలింగ్‌లో కమ్మిన్స్ నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో కమ్మిన్స్ ఏడో స్థానంలో ఉన్నాడు.