అస్సాంలో హిజ్రాల కోసం ప్రత్యేక టీకా డ్రైవ్

గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిజ్రాల ప్రధాన వృత్తి భిక్షాటన అని, రోజూ జనాల చుట్టూ తిరుగుతారు కనుక వారికి కరోనా నుంచి అధిక రక్షణ అవసరమని అఖిల అసోం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, అసోం ప్రభుత్వ ట్రాన్స్ జెండర్ బోర్డు వైస్-చైర్ పర్సన్ స్వాతి బిధాన్ బారువా తెలిపారు. నిస్సహాయ వర్గాలకు చెందిన హిజ్రాలకు టీకాలు వేయడంలో సహజంగానే అలసత్వం ఉంటుందని, ఆరోగ్య శాఖకు వివరిస్తే వారు వెంటనే టీకాలు వేసేందుకు ముందుకు వచ్చారని ఆమె వివరించారు. మొత్తం మీద ఎలాంటి సమస్యా లేకుండా హిజ్రాల టీకాల కార్యక్రమం సాగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం గువాహటికి పరిమితమైన ఈ డ్రైవ్ తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

