Health tips | ఆలుగడ్డ పొట్టును గీరి పారవేస్తున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Health tips : చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆలుగడ్డ కర్రీని (Potato curry) అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆలూ ఫ్రై (Potato fry) చేస్తే ఆ టేస్టే వేరు. ఆలూతో ఇంకా చాలా రకాల వంటలు చేయవచ్చు. అందరికీ ఎంతో ఇష్టమైన చిప్స్ను కూడా వీటితోనే తయారుచేస్తారు. ఆలుగడ్డలో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆలుగడ్డ పొట్టులో (Potato peel) పోషకాలు మెండు. ఈ పోషకాలు మనకు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. అయితే చాలా మంది ఆలూ తొక్కను తీసేసి వండుతారు. అయితే ఇలా చేయడం వల్ల పోషకాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆలుగడ్డ తొక్కపై మట్టి, దుమ్ము ఉంటాయని పొట్టు తీసేస్తుంటారు. వాస్తవానికి ఆలూను పొట్టుతో సహా తినాలి. పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేగాక ఆలుగడ్డ పొట్టులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ పని తీరును చక్కబెడుతుంది.
అంతేకాదు ఆలూ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా లభ్యమవుతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఆలూ పొట్టులోని పోషకాలతో ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అందుకే ఇప్పటి నుంచైనా ఆలుగడ్డ తొక్క తీయకుండా వండుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే విలువైన పోషకాలను కోల్పోతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్