ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
మెదడు | ప్రస్తుతం మనలో అధిక శాతం మంది రాత్రి పూట చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. టీవీ చూడడమో, గేమ్స్ ఆడడమో… లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా అనేక మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు.

ప్రస్తుతం మనలో అధిక శాతం మంది రాత్రి పూట చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. టీవీ చూడడమో, గేమ్స్ ఆడడమో… లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా అనేక మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
దీంతో ఉదయం కూడా ఆలస్యంగానే నిద్ర లేస్తున్నారు. అయితే నిజానికి ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. రాత్రి పూట త్వరగా నిద్రపోయి మరుసటి రోజు ఉదయాన్నే త్వరగా మేల్కొనాలని వైద్యులు చెబుతుంటారు. కానీ ఈ సూచనలను కొందరు మాత్రం అస్సలు పాటించరు.
అయితే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారి పట్ల తాజాగా చేసిన సర్వేలు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూకేలో ఆలస్యంగా నిద్రపోయే కొందరిని సైంటిస్టులు సర్వే చేశారు. దీంతో తేలిందేమిటంటే.. ఆలస్యంగా నిద్రించడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుందట.
జ్ఞాపకశక్తి తగ్గుతుందట. ఏకాగ్రత, చురుకుదనం పోతాయట. అలాగే ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా పట్టించుకోరట. దీంతో వారికి నిత్య జీవితంలో అవరోధాలు ఏర్పడుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
కనుక ఎవరైనా సరే.. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. రోజూ రాత్రి త్వరగా నిద్రపోయి, మరుసటి రోజు త్వరగా నిద్ర లేవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- brain function
- decreases
- late
- sleep
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

