ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అమరావతి: ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో “దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో” జరిగింది. అన్ని రంగాల పెట్టుబడులకు అవకాశం ఉన్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
సహజవనరులు, సకల సదుపాయాలు పుష్కలంగా కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ “యూ గ్రో వి గ్రో” అన్న ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మంత్రి మేకపాటి వినిపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలపై ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన వీడియో పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. దుబాయ్ ఎక్స్ పో 2020 పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల అధికారుల బృందం సోమవారం మూడు కీలక ఎంవోయూలను కుదుర్చుకుంది. రెండు జీ2బీ, ఒక బీ2బీ తరహా అవగాహన ఒప్పందాలు చేసుకుంది.
లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకుంది. రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన రీజెన్సీ గ్రూప్ కూడా ఎంవోయూ కుదుర్చుకుంది. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఏపీ ఒప్పందం చేసుకుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

