తలనొప్పిని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!

పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుండడం సహజం. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తుంటుంది. ఇక వేసవిలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే తలనొప్పి కచ్చితంగా వస్తుంది. అయితే ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే.. ఇక ఏ పనీ చేయబుద్ది కాదు. తలనొప్పికి తల పగిలిపోతుందేమోనని అనిపిస్తుంది. కానీ కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీ, క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవచ్చు. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది.
ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంత సేపు చల్లని నీడలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. కంళ్లను బాగా కడగాలి. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది.
నీటిని తగినంత తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.
చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.
అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

