బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌కు ఉజ్జయినిలో నిరసన సెగ..
ఉజ్జయిని: ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ ఆలయం వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొన్నది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ .. మహాకాలేశ్వర్ ఆలయాన్ని ఇవాళ సందర్శించాల్సి ఉంది. అయితే దానికి ముందే విశ్వహిందూ, భజరంగ్ దళ్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలతో బాలీవుడ్ జంటకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని తరిమేందుకు పోలీసులు లాఠీలకు పని పెట్టారు.
బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లో భాగంగా డైరక్టర్ అయాన్ ముఖర్జీతో కలిసి ఆలియా, రణ్‌బీర్ .. మహాకాలేశ్వర్ ఆలయాన్ని విజిట్ చేయాలనుకున్నారు. మహాకాలేశ్వరుడి దర్శనం చేసుకోకుండానే ఆలియా, రణ్‌బీర్‌లు ఇండోర్ చేరుకున్నారు. కేవలం దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రమే ఆలయ దర్శనం చేసుకున్నాడు. బీఫ్ తింటానని గతంలో రణ్‌బీర్ చేసిన కామెంట్ మళ్లీ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భజరంగ్ దళ్ రణ్‌బీర్ రాకను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

