అఖండ విశ్వరూపం

‘తన మాటే దైవ శాసనమని శత్రువుకు సవాల్ విసురుతున్న అఖండ కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్ జంటగా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. సెన్సార్ పూర్తయింది. ‘యు.ఎ’ సర్టిఫికెట్ లభించినట్లు చిత్రబృందం పేర్కొన్నది. నిర్మాత మాట్లాడుతూ ‘మాస్ యాక్షన్ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. అఘోరాగా బాలకృష్ణ గెటప్, నటన ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థంలో ఆయన నట విశ్వరూపాన్ని చూస్తారు. విలన్‌గా శ్రీకాంత్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసించడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

