హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 : ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలకు గొప్ప ఆదరణ ఉంటుందనడానికి నిదర్శనం హైదరాబాద్‌లోని సీపీఎల్ అంబర్‌పేట స్కూల్. 2007లో ఏర్పాటైన ఈ స్కూలు మంచి ఫలితాలు సాధిస్తున్నది. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో 690 మంది, ఉన్నత పాఠశాలలో 800 మంది మొత్తంగా 1,490 మంది విద్యార్థులు ఉండటం విశేషం. పదో తరగతి ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నట్టు హెడ్మాస్టర్ కే మధుశాలిని తెలిపారు. విద్యాశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌లో తమ విద్యార్థులు మంచి ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారని, క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈ పాఠశాలలో 26 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.