అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్-2’ ది సెకండ్ కేస్’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వాల్పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిరినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ ఏపీకి చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణదేవ్ అలియాస్ కేడీ పాత్రలో కనిపించబోతున్నారు. ‘పరిశోధనాత్మక థ్రిల్లర్గా సాగే చిత్రమిది. ఓ కేసును ఛేదించే క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయి. అడివిశేష్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ఆకట్టుకుంటారు’ అని చిత్రబృందం పేర్కొంది.