రామ్‌కార్తీక్, హెబాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్ కోనేటి దర్శకుడు. ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ అంశాలు కలబోసిన చిత్రమిది. హెబాపటేల్ పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుంది. తెలిసినవాళ్లు ఏం చేశారన్నది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అని దర్శకుడు తెలిపారు. నరేష్, పవిత్రాలోకేష్, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అజయ్ వి నాగ్, సంగీతం: దీపక్ వేణుగోపాలన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి.