ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఆయుధ లైసెన్సు మంజూరీ అయ్యింది. ఇటీవల సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన విషయం తె లిసిందే. పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య జరిగిన కొన్ని రోజుల తేడాలోనే నటుడు సల్మాన్‌తో పాటు ఆయన తండ్రికి బెదిరింపులు వచ్చాయి. అయితే ఆయుధ లైసెన్సు ఇచ్చే అధికార సంస్థ దర్యాప్తును చేపట్టింది. ఆత్మరక్షణ నిమిత్తం సల్మాన్‌కు లైసెన్సు మంజూరీ కానున్నది. గన్ లైసెన్సు కావాలంటూ గత నెలలో ముంబై పోలీసు కమీషనర్ వివేక్ ఫన్సల్కర్‌ను సల్మాన్ కలిసిన విషయం తెలిసిందే. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం సల్మాన్ పోలీసు ఆఫీసుకు వెళ్లారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హీరో సల్మాన్‌ను బెదిరించారు. 1998లో జరిగిన కృష్ణ జింక కేసుతో ఈ బెదిరింపులకు లింక్ ఉంది.