HomeNewsAbhiram Daggubati Intriguing First Look From His Debut Film Ahimsa Released
రెండు కొత్త చిత్రాలతో
హీరో రానా సోదరుడు అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘అహింస’. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ రూపొందిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది.
హీరో రానా సోదరుడు అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘అహింస’. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ రూపొందిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. పి.కిరణ్ నిర్మాత. మంగళవారం దర్శకుడు తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా ప్రీలుక్ విడుదల చేశారు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.
పీరియాడిక్ డ్రామాగా విక్రమాదిత్య : దర్శకుడు తేజ రూపొందిస్తున్న మరో కొత్త చిత్రం ‘విక్రమాదిత్య’ టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 1863 సంవత్సరంలో జరిగిన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మంగళవారం సినిమాను ప్రారంభించారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.